పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పూరువు వృత్తాంతము

  •  
  •  
  •  

9-552-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యదుం డొడంబడకున్న యయాతి దుర్వసు ద్రుహ్యాదుల నడిగిన వారును యదువు పలికినట్ల పలికినఁ గడగొట్టు కుమారుండైన పూరువున కిట్లనియె.

టీకా:

అని = అని; యదుండు = యదుడు; ఒడంబడకున్న = ఒప్పుకోకపోవుటచే; యయాతి = యయాతి; దుర్వసు = దుర్వసుడు; ద్రుహ్య = ద్రుహ్యుడు; ఆదులన్ = మున్నగువారిని; అడిగినన్ = అడుగగా; వారునున్ = వారు కూడ; యదువు = యదుడు; పలికిన = చెప్పిన; అట్ల = విధముగనే; పలికినన్ = చెప్పగా; కడగొట్టు = అందరిలోకి చిన్న; కుమారుడున్ = పుత్రుడు; ఐన = అయినట్టి; పూరువున్ = పూరువున; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.

భావము:

అని యదువు తిరస్కరించాడు. అంత, యయాతి తుర్వసుడిని ద్రుహ్యుడిని అడుగగా, వారు కూడ యదువు చెప్పినట్లే చెప్పారు. కడగొట్టు కొడుకైన పూరువుని ఇలా అడిగాడు.