పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : యయాతి శాపము

  •  
  •  
  •  

9-543-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మామకేల చెప్ప మాను సరోజాక్షి
నుజతనయఁ బొంది ప్పుపడితిఁ
గామినయిన నన్నుఁ రుణింపు పతిమాట
తండ్రిమాటకంటెఁ గును సతికి."

టీకా:

మామ = మామయ్య; కిన్ = కి; ఏలన్ = ఎందుకు; చెప్పన్ = చెప్పుట; మాను = వదలిపెట్టు; సరోజాక్షి = పద్మనయన; దనుజతనయన్ = శర్మిష్ఠతో; పొంది = కవయుట జేసి; తప్పుపడితిన్ = తప్పు చేసితిని; కామిని = అనురక్తి కలవాడను; అయిన = ఐన; నన్నున్ = నన్ను; కరుణింపు = కనికరించుము; పతి = భర్త యొక్క; మాటన్ = మాట; తండ్రి = తండ్రి యొక్క; మాటన్ = మాట; కంటెన్ = కంటె; తగున్ = మన్నింపదగినది; సతి = ఇల్లాలి; కిన్ = కి.

భావము:

“పద్మాక్షి! మామయ్యకి ఎందుకు చెప్పడం. ఈ సారికి వదలివెయ్యి, శర్మిష్ఠతో కలిసి తప్పు చేసాను నిజమే. మన్నించి నన్ను కనికరించు. ఇల్లాలికి భర్త మాట, తండ్రి మాట కంటె మన్నింపదగినది."