పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దేవయాని యయాతి వరించుట

  •  
  •  
  •  

9-539-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తమైన వేడ్క దనుజాధిపమంత్రి సురారినందనో
పేతఁ దనూభవం బిలిచి పెండ్లి యొనర్చె మహావిభూతికిం
బ్రీతి మహోగ్రజాతికి నభీతికి సాధువినీతికిన్ సిత
ఖ్యాతికి భిన్నదుఃఖబహుకార్యభియాతికి నయ్యయాతికిన్.

టీకా:

ఆతతము = అధికము; ఐన = అయినట్టి; వేడ్కన్ = ఉత్సాహముచేత; దనుజాధిపమంత్రి = శుక్రుడు {దనుజాధిపమంత్రి - రాక్షసరాజు యొక్క పురోహితుడు, శుక్రుడు}; సురారి = వృషపర్వుని {సురారి - దేవతల శత్రువు, వృషపర్వుడు}; నందన = పుత్రికచే; ఉపేత = సేవింపబడుచున్న; తనూభవన్ = కూతురును; పిలిచి = పిలిచి; పెండ్లి = వివాహము; ఒనర్చెన్ = చేసెను; మహా = గొప్ప; విభూతి = సంపదలు కలవాని; కిన్ = కి; ప్రీతిన్ = ఇష్టముగా; మహోగ్రజాతి = క్షత్రియకులము వాని; కిన్ = కి; అభీతి = భయము లేనివాని; కిన్ = కి; సాధు = సాధువులపట్ల; వినీతి = వినయము కలవాని; కిన్ = కి; సిత = స్వచ్ఛమైన; ఖ్యాతి = కీర్తి కలవాని; కిన్ = కి; భిన్న = అనేకమైన; దుఃఖ = దుఃఖములతో; బహుకార్యా = ఊడ్చిపెట్టబడిన; అభియాతి = శత్రువులు కలవాని; కిన్ = కి; ఆ = ఆ; యయాతి = యయాతి; కిన్ = కి.

భావము:

మిక్కిలి ఉత్సాహంతో శుక్రుడు వృషపర్వుని పుత్రిక శర్మిష్ఠచే సేవలు అందుకుంటున్న కూతురు దేవయానిని అభినందించాడు. మహాసంపన్నుడు, నిర్భయుడు, సాధువినీతుడు, నిర్మలఖ్యాతి, శత్రు వినిర్మూలుడు, క్షత్రియుడు అయిన యయాతిని పిలిచి దేవయానిని ఇచ్చి ప్రీతిగా వివాహం చేసాడు.