పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దేవయాని యయాతి వరించుట

  •  
  •  
  •  

9-536-త.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"చెలులు వేవురుఁ దాను నీ సుత చేటికైవడి నా సుతం
గొలుచు చుండినఁ దీఱుఁ గోపము గొల్వఁ బెట్టెదవేని నీ
వెలఁదిఁ దోడ్కొని వత్తు" నావుడు వేగ రమ్మని భార్గవిం
గొలువఁ బెట్టె సురారివర్యుఁడు గూఁతు నెచ్చలిపిండుతోన్.

టీకా:

చెలులు = సేవకురాళ్ళు; వేవురు = వెయ్యిమంది; తానున్ = ఆమె; నీ = నీ యొక్క; సుత = కూతురు; చేటి = దాసి; కైవడిన్ = వలె; నా = నా యొక్క; సుతన్ = పుత్రికను; కొలుచుచుండినన్ = సేవించుతుంటే; తీఱున్ = తగ్గును; గోపము = గోపము; కొల్వన్ = సేవించుటకు; పెట్టెదవు = నియమించెదవు; ఏని = అయినచో; ఈ = ఈ; వెలదిన్ = యువతిని; తోడ్కొని = కూడ తీసుకొని; వత్తును = వచ్చెదను; వేగన్ = శీఘ్రమే; రమ్ము = రా; అని = అని; భార్గవిన్ = దేవయానిని; కొలువన్ = సేవించుటకు; పెట్టెన్ = పంపించెను; సురారివర్యుడున్ = రాక్షసరాజు; కూతున్ = పుత్రికను; నెచ్చలి = చెలుల; పిండు = సమూహము; తోన్ = తోటి.

భావము:

“నీ కూతురు శర్మిష్ఠ తన వెయ్యిమంది సేవకురాళ్ళతో దాసి వలె నా కుమార్తె దేవయానిని సేవిస్తుంటే నా కోపం తగ్గుతుంది. అలా నియమిస్తావా చెప్పు అలా అయితే ఈమెను కూడ తీసుకొని వచ్చేస్తాను” అంత రాక్షసరాజు పుత్రికను చెలులతో సహా దేవయానిని సేవించేలా చేసాడు.