పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దేవయాని యయాతి వరించుట

  •  
  •  
  •  

9-535-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని వృషపర్వుకడ నుండుట నిందించుచు శుక్రుం డా కూఁతుం దోడ్కొని పురంబు వెడలి చన; నయ్యసురవల్లభుం డెఱింగి శుక్రుని వలనం దేవతల గెలువఁదలంచి తెరువున కడ్డంబువచ్చి, పాదంబులపైఁ బడి, ప్రార్థించి ప్రసన్నుం జేసిన, నా కోపంబు మాని శుక్రుండు శిష్యున కిట్లనియె.

టీకా:

అని = అని; వృషపర్వుని = వృషపర్వుని; కడన్ = దగ్గర; ఉండుటన్ = ఉండుటను; నిందించుచున్ = అయిష్టపడుచు; శుక్రుండు = శుక్రుడు; ఆ = ఆ; కూతున్ = కుమార్తెను; తోడ్కొని = వెంటబెట్టుకెని; పురంబున్ = నగరమును; వెడలి = వదలిపెట్టి; చనన్ = వెళ్ళిపోగా; ఆ = ఆ; అసుర = రాక్షస; వల్లభుండు = రాజు; ఎఱింగి = తెలిసి; శుక్రునిన్ = శుక్రుని; వలనన్ = ద్వారా; దేవతలన్ = దేవతలను; గెలువన్ = జయించవలెనని; తలంచి = భావించి; తెరువునన్ = దారికి; అడ్డంబు = అడ్డమై; వచ్చి = వచ్చి; పాదంబులన్ = పాదాల; పైన్ = మీద; పడి = పడి; ప్రార్థించి = అర్థించి; ప్రసన్నున్ = శాంతించినవాని; చేసినన్ = చేయగా; ఆ = అంత; కోపంబున్ = కోపమును; మాని = వదలిపెట్టి; శుక్రుండు = శుక్రుడు; శిష్యున్ = శిష్యుని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = చెప్పెను.

భావము:

ఇలా అనుకుని వృషపర్వుని దగ్గర ఉండుటకు యిష్టపడక శుక్రుడు తన కుమార్తెను వెంటబెట్టుకుని నగరం విడిచి వెళ్ళిపోసాగాడు. ఆ రాక్షస రాజు తెలిసి శుక్రుని ద్వారా దేవతలను జయించాలని భావించి వచ్చి పాదాల మీద పడి అర్థించి శాంతింప చేసాడు. అంత కోపమును వదలిపెట్టి శుక్రుడు శిష్యునికి ఈ విధంగా చెప్పాడు.