పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దేవయాని యయాతి వరించుట

  •  
  •  
  •  

9-534-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"క్రూరాత్ముల మందిరములఁ
బౌరోహిత్యంబు కంటె పాపం బీ సం
సాముకంటె శిలల్ దిని
యూక కాపోతవృత్తి నుండుట యొప్పున్."

టీకా:

క్రూరాత్ముల = కఠినుల; మందిరములన్ = ఇళ్ళలో; పౌరోహిత్యంబు = పురోహితునిగా చేయుట; కంటెన్ = కంటెను; పాపంబు = పాపపు పని; ఈ = ఈ; సంసారము = సంసారము; కంటెన్ = ఇంతకంటె; శిలల్ = రాలినవి ఏరుకుని; తిని = తిని; ఊరక = ఉరికే; కాపోత = పావురాల; వృత్తిన్ = లాగ; ఉండుటన్ = నివసించుట; ఒప్పున్ = తగినపని.

భావము:

అప్పుడు శుక్రుడు ఇలా అనుకున్నాడు. “కఠినాత్ముల ఇళ్ళలో పురోహితుడిగా చేయుట కంటె పాపపు పని లేదు. ఈ సంసారాన్ని సాగించడం కన్నా రాలినవి ఏరుకుని తిని ఉరక ఉండడం మంచిది.