పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దేవయాని యయాతి వరించుట

  •  
  •  
  •  

9-533-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు వరించి, యయాతి చనిన వెనుక దేవయాని శుక్రునికడకుం జని, శర్మిష్ఠ చేసిన వృత్తాంతం బంతయు జెప్పి కన్నీరుమున్నీరుగా వగచిన.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; వరించి = ప్రేమించి; యయాతి = యయాతి; చనిన = వెళ్లిన; వెనుకన్ = తరువాత; దేవయాని = దేవయాని; శుక్రుని = శుక్రుని; కడ = వద్ద; కున్ = కు; చని = వెళ్ళి; శర్మిష్ఠ = శర్మిష్ఠ; చేసిన = చేసినట్టి; వృత్తాంతంబు = సంగతి; అంతయున్ = అంతటిని; చెప్పి = చెప్పి; కన్నీరు = కన్నీళ్ళు; మున్నీరు = కాలువలుకట్టినట్లు; కాన్ = కాగా; వగచినన్ = దుఃఖించగా .

భావము:

ఈ విధంగా యయాతి వరించి వెళ్లాకా దేవయాని శుక్రుని వద్దకు వెళ్ళి శర్మిష్ఠ చేసిన పనంతా చెప్పి కన్నీళ్ళు కారుస్తూ దుఃఖించింది.