పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దేవయాని యయాతి వరించుట

  •  
  •  
  •  

9-532-మత్త.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దైయోగముగాక విప్రసుతన్ వరించునె నా మనం
బే విధంబున నీశ్వరాజ్ఞయు నిట్టి దంచు వరించె ధా
త్రీరుండును దేవయానిని ధీరబుద్ధులకున్ మనో
భా మొక్కటియే ప్రమాణ మభావ్యభావ్య పరీక్షకున్.

టీకా:

దైవయోగమున్ = దైవఘటనవలన; కాక = తప్పించి; విప్ర = బ్రాహ్మణుని; సుతన్ = పుత్రికను; వరించునె = కోరునే, కోరదు; నా = నా యొక్క; మనంబున్ = మనసు; ఏవిధంబునన్ = ఎలా చూసిన; ఈశ్వర = భగవంతుని; ఆజ్ఞ = నిర్ణయము; ఇట్టిది = ఇలా ఉంది; అంచున్ = అనుచు; వరించెన్ = వరించెను; ధాత్రీవరుండు = రాజు; దేవయానిని = దేవయానిని; ధీరబుద్ధుల్ = ధీరుల; కున్ = కు; మనః = మనసు నందలి; భావము = తలపు; ఒక్కటియే = మాత్రమే; ప్రమాణము = సత్యమైనది; భావ్య = సరియైనది; అభావ్య = సరికానిది; పరీక్ష = పరీక్షించుట; కున్ = కు.

భావము:

దైవఘటన తప్పించి బ్రాహ్మణకన్యను నా మనసు కోరదు, ఎలా చూసినా భగవంతుని నిర్ణయము ఇలా ఉంది అనుకుని రాజు దేవయానిని వరించాడు. ధీరులకు సరియైంది అవునో కాదో పరీక్షించుటకు మనస్సాక్షే సత్యమైనది.