పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దేవయాని యయాతి వరించుట

  •  
  •  
  •  

9-531.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ది నిమిత్తంబు నాకు బ్రాహ్మణుఁడు గాఁడు
ప్రాణనాథుఁడ వీ" వని డఁతి పలుకఁ
నదు హృదయంబు నెలఁతపైఁ గులుపడినఁ
మక మొక యింతయును లేక లఁచి చూచి.

టీకా:

సు = మంచి; గుణ = గుణములను; ఆఢ్య = సంపద కలవాడ; విను = వినుము; నేను = నేను; శుక్రుని = శుక్రుని యొక్క; కూతురన్ = పుత్రికను; దేవయానినిన్ = దేవయానిని; తొల్లి = ఇంతకు పూర్వము; దేవమంత్రి = బృహస్పతి; తనయుండు = కొడుకు; కచుడు = కచుడు; మా = మా; తండ్రి = తండ్రి; చేతన్ = వలన; మృతసంజీవనిన్ = మృతసంజీవనీ విద్య {మృతసంజీవని - మృత (మరణించినవారిని) సంజీవని (బతికించెడిది)}; తాన్ = అతను; అభ్యసించు = నేర్చుకొనెడి; వేళన్ = సమయమునందు; అతనిన్ = అతనిని; కామించినన్ = కోరగా; అతడున్ = అతను; ఒల్లన్ = ఒప్పుకొనను; అనవుడు = అనుటతో; అతడున్ = అతను; నేర్చిన = నేర్చుకొన్నట్టి; విద్య = జ్ఞానము {చతుర్విద్యలు - 1ఆన్వీక్షకి (ఇందు విజ్ఞానము తెలుప బడును) 2త్రయి (ఇందు ధర్మాధర్మములు తెలుపబడును) 3వార్త (ఇందు అర్థానర్థములు తెలుపబడును) 4దండనీతి (ఇందు నయానయములు తెలుపబడును)}; అడగిపోవన్ = అశక్తముగునట్లు; అతనిన్ = అతనిని; శపించినన్ = శపించగా; అతడున్ = అతను; నా = నా యొక్క; భర్త = మొగుడు; బ్రాహ్మణుడు = విప్రుడు; కాకుండుము = కాకపోవుగాక; అని = అని; శపించెన్ = శాపము నిచ్చెను; అది = ఆ.
నిమిత్తంబున్ = కారణముచేత; నా = నా; కున్ = కు; బ్రాహ్మణుడు = బ్రాహ్మణుడు; కాడు = భర్తగా రాడు; ప్రాణనాథుడవు = భర్తవు; ఈవ = నీవే; అని = అని; పడతి = ఇంతి; పలుకన్ = చెప్పగా; తనదు = తన యొక్క; హృదయంబున్ = మనసు; నెలత = యువతి; పైన్ = మీద; తగులుపడిన = తగుల్కొన్నను; తమకము = తొందరపాటు; ఒకయింతయున్ = ఏమాత్రము; లేక = లేకుండగ; తలచి = ఆలోచించి; చూచి = చూసి.

భావము:

ఓ సుగుణవంతుడా! విను. నేను శుక్రుని పుత్రిక దేవయానిని. ఇంతకు పూర్వం బృహస్పతి కొడుకు కచుడు మా తండ్రి వలన మృతసంజీవనీవిద్య నేర్చుకొనే సమయంలో అతనిని కోరగా అతను ఒప్పుకోలేదు. నేను అతను నేర్చుకొన్న విద్యలు పనికిరాకపోవు గాక అని శపించాను. అతను నా భర్త విప్రుడు కాకపోవు గాక అని శపించాడు. ఆ కారణంచేత నాకు బ్రాహ్మణ భర్త రాడు. నీవే నా భర్తవు.” అని ఇంతి చెప్పగా, యయాతి యువతిపై మనసు పడ్డా, ఏమాత్రం తొందరపాటు పడకుండా ఇలా ఆలోచించాడు..