పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : యయాతి చరిత్రము

  •  
  •  
  •  

9-523-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బోటిపిండుచేతఁ బొదువంగఁ బట్టించి
రాజసమున దైత్యరాజతనయ
దొడరి దేవయానిఁ ద్రోపించె వలు వీక
క్రుంకి నూతిలోనఁ గుతిలఁకొనఁగ.

టీకా:

బోటి = చెలుల; పిండు = సమూహము; చేతన్ = చేత; పొదువంగ = గట్టిగా; పట్టించి = పట్టింపించి; రాజసమున్ = అధికార గర్వముతో; దైత్య = రాక్షస; రాజ = రాజు యొక్క; తనయ = కుమార్తె; తొడరి = యత్నించి; దేవయానిన్ = దేవయానిని; త్రోపించెన్ = తోయించెను; వలువన్ = బట్టలు; ఈకన్ = ఇవ్వకుండగ; క్రుంకి = ములిగి; నూతి = నుయ్యి; లోనన్ = లోపల; కుతిలకొనగన్ = బాధపడునట్లుగా.

భావము:

రాక్షస రాజు కూతురుని అన్న గర్వంతో శర్మిష్ఠ చెలులచేత బలవంతంగా దేవయానిని వివస్త్రగా బావిలోకి తోయించింది. ఆమె నూతిలో పడి అలా బాధపడుతూ ఉండిపోయింది.