పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : యయాతి చరిత్రము

  •  
  •  
  •  

9-521-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"బిక్షుండై తమ తండ్రి మా జనకునిన్ బిక్షించినం దన్ను సం
క్షింపం దుది నింత యై మఱపుతో రాజప్రసూనాకృతి
న్రక్షోరాజతనూజతో సుగుణతో నాతో సమం బాడెడిం
గుక్షిస్ఫోటముగాఁగ దీనిఁ జెలు లీ కూపంబునం ద్రోవరే."

టీకా:

భిక్షుండు = బిచ్చగాడు; ఐ = అయ్యి; తమ = మీ యొక్క; తండ్రి = తండ్రి; మా = మా యొక్క; జనకునిన్ = తండ్రిని; భిక్షించినన్ = అడుక్కొనగా; తన్నున్ = అతనిని; సంరక్షింపన్ = కాపాడగా; తుదిన్ = చివరకు; ఇంత = ఇంత పెద్దది; ఐ = అయ్యి; మఱపు = మరచిపోవుట; తోన్ = చేత; రాజ = క్షత్రియపు; ప్రసూన = పుట్టుక కలామె; ఆకృతిన్ = వలె; రక్షస్ = రాక్షస; రాజ = రాజు యొక్క; తనూజ = పుత్రిక {తనూజ - తనువున పుట్టినామె, పుత్రిక}; తోన్ = తోటి; సుగుణ = బుద్ధిమంతురాలి; తోన్ = తోటి; నా = నా; తోన్ = తోటి; సమంబున్ = సమానముగా; ఆడెడిన్ = పేలుతున్నది; కుక్షి = కడుపు; స్పోటము = బద్దలు; కాగన్ = అయ్యేలాగున; దీనిన్ = ఈపెను; చెలులు = చెలికత్తెలు; ఈ = ఈ; కూపంబునన్ = నూతిలోకి; త్రోవరే = తొయ్యండి.

భావము:

“మీ తండ్రి మా తండ్రిని బిచ్చగాడిలా అడుక్కోగా, మా తండ్రి సంరక్షించాడు. చెలికత్తెలారా! అదంతా మరచి రాక్షసరాజు పుత్రికను నాతో సమానమైన రాచకన్నెలా అహంకరించి పేలుతోంది. దీని కడుపు బద్దలు అయ్యేలా ఈమెను ఈ నూతిలోకి తొసెయ్యండి."