పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : యయాతి చరిత్రము

  •  
  •  
  •  

9-515-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హరుఁ జూచి సిగ్గుపడి మానిను లందఱు సంభ్రమంబునన్
లువలు గట్టుచో దనుజల్లభుకూఁతురు దేవయాని దు
వ్వలువ ధరించి వేగమున చ్చినఁ జూచి యెఱింగెఱింగి నా
లు విది యెట్లు కట్టికొనిచ్చిన దానవు యంచుఁ దిట్టుచున్.

టీకా:

మలహరున్ = శివుని {మలహరుడు - మల (దోషములను) హరుడు (తొలగించెడివాడు), శంకరుడు}; చూచి = చూసి; సిగ్గుపడి = లజ్జకలిగి; మానినుల్ = ఇంతులు; అందఱున్ = అందరు; సంభ్రమంబునన్ = తొట్రుబాటుతో; వలువలు = వస్త్రములను; కట్టుచో = కట్టుకొనునప్పుడు; దనుజ = రాక్షస; వల్లభు = రాజు; కూతురున్ = పుత్రిక; దేవయాని = దేవయాని యొక్క; దువ్వలువ = దుప్పటము, పైబట్ట; ధరించి = కట్టుకొని; వేగమునన్ = శ్రీఘ్రముగ; వచ్చినన్ = రాగా; చూచి = కనుగొని; ఎఱింగెఱింగిన్ = తెలిసితెలిసి; నా = నా యొక్క; వలువ = బట్ట; ఇది = దీనిని; ఎట్లు = ఎలా; కట్టికొని = ధరించి; వచ్చినదానవు = వచ్చావు; అంచున్ = అనుచు; తిట్టుచున్ = తిడుతూ.

భావము:

పరమశివుని చూసి లజ్జతో ఇంతులు అందరు వస్త్రాలు కట్టుకొన్నారు. కాని రాక్షసరాజు పుత్రిక శర్మిష్ఠ పైబట్ట తొందరలో తనది అనుకుని దేవయాని కట్టుకొని రాగా చూసి, శర్మిష్ఠ తెలిసి తెలిసి నా బట్ట ఎలా ధరించావు అంటూ తిట్టింది.