పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : యయాతి చరిత్రము

  •  
  •  
  •  

9-514-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నుజేంద్రు కూఁతురు రళాక్షి శర్మిష్ఠ-
పురములో నొకనాఁడు ప్రొద్దుపోక
వేవురుబోటులు వెంటరా గురుసుత-
గు దేవయానితో నాట మరిగి
పూచిన యెలదోఁట పొంత జొంపముగొన్న-
క్రొమ్మావి చేరువ కొలఁకుఁ జేరి
యందుఁ దమ్ములతేనె లాని చొక్కుచు మ్రోయు-
ళుల ఝంకృతులకు దిరిపడుచు

9-514.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లువ లూడ్చి కొలఁకు డిఁ జొచ్చి తమలోన
బెల్లు రేఁగి నీటఁ ల్లులాడ
నందినెక్కి మౌళి నిందురోచులు పర్వ
శూలి వచ్చెఁ గొండచూలితోడ.

టీకా:

దనుజ = రాక్షసుల; ఇంద్రున్ = రాజు యొక్క; కూతురున్ = కుమార్తె; తరళాక్షి = సుందరి {తరళాక్షి - చలించెడి కన్నులు కలామె, స్త్రీ}; శర్మిష్ఠ = శర్మిష్ఠ; పురము = నగరి; లోన్ = లోపల; ఒక = ఒకానొక; నాడు = దినమున; ప్రొద్దపోక = తోచక; వేవురు = వేయిమంది; బోటులు = చెలులు; వెంటన్ = కూడా; రాన్ = వస్తుండగా; గురు = గురువు యొక్క; సుత = కూతురు; అగు = అయినట్టి; దేవయాని = దేవయాని; తోన్ = తోటి; ఆటన్ = ఆడుకొనుటను; మరిగి = అలవాటుపడి; పూచిన = పూతపూసియున్న; ఎలదోట = ఉద్యానవనము; పొంతన్ = వద్ద; జొంపమున్ = గుబురుగ; కొన్న = ఉన్నట్టి; క్రొమ్మావి = మామిడిచెట్టు; చేరువన్ = దగ్గరలో; కొలకున్ = కొలను; చేరి = చేరి; అందున్ = దానిలోని; తమ్ములన్ = పద్మముల యొక్క; తేనెల్ = మకరందమును; ఆని = తాగి; చొక్కుచున్ = పరవశించి; మ్రోయు = చప్పుడు చేయుచున్న; అళుల = తుమ్మెదల; ఝంకృతుల్ = ఝంకారముల; కున్ = కు; అదిరిపడుచు = ఉలిక్కిపడుతు.
వలువలు = బట్టలు; ఊడ్చి = విప్పి; కొలకున్ = కొలనులోకి; వడిన్ = విసురుగా; చొచ్చి = దూకి; తమలోనన్ = వారిలోవారు; పెల్లున్ = మిక్కిలిగా; రేగి = రెచ్చిపోయి; నీటన్ = నీటిలో; చల్లులాడన్ = జలకాలాడుతుండగా; నందిన్ = నందివాహనమును; ఎక్కి = అధిరోహించి; మౌళిన్ = సిగలో; ఇందు = చంద్రుని; రోచులు = కాంతులు; పర్వన్ = పరచుకొనగా; శూలి = శివుడు {శూలి - త్రిశూలము ఆయుధముగ కలవాడు, శంకరుడు}; వచ్చెన్ = వచ్చెను; కొండచూలి = పార్వతీదేవి; తోడన్ = తోపాటు.

భావము:

“రాక్షసరాజు కుమార్తె సుందరీమణి శర్మిష్ఠ గురువు శుక్రాచార్యుని కూతురు దేవయాని తోటి ఆడుకొనుటను అలవాటుపడింది. ఒకనాడు తోచక వేయిమంది చెలులు సేవిస్తుండగా శర్మిష్ఠ దేవయానితో కలిసి ఉద్యానవనంలో ఉన్న కొలను చేరి బట్టలు విప్పి కొలనులో రెచ్చిపోయి జలకాలు అడుతున్నారు. నందివాహనం అధిరోహించి పార్వతీ పరమేశ్వరులు వచ్చారు