పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : యయాతి చరిత్రము

  •  
  •  
  •  

9-512-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"పార్థివుఁడు యయాతి బ్రహ్మర్షి భార్గవుఁ
ల్లుఁ డగుట మామ గుట యెట్లు?
రాజు రాచకూఁతు తిజేయఁ దగు గాక
విప్రకన్య నొంద విహిత మగునె?"

టీకా:

పార్థివుడు = క్షత్రియుడు; యయాతి = యయాతి; బ్రహ్మర్షి = బ్రహ్మఋషి; భార్గవున్ = శుక్రుడు; అల్లుడు = కూతురు భర్త; అగుట = ఔట; మామ = పెండ్లాము తండ్రి; అగుట = ఔట; ఎట్లు = ఎలాగైనది; రాజు = రాజవంశపువాడు; రాచకూతున్ = రాజవంశపుస్త్రీని; రతిచేయన్ = వివాహముచేసికొన; తగున్ = పద్దతి; కాక = అలాకాకుండగ; విప్ర = బ్రాహ్మణకులపు; కన్యన్ = కన్యను; ఒందన్ = పొందుట; విహితము = పద్దతి; అగునె = అవుతుందా, కాదు.

భావము:

“యయాతి క్షత్రియుడు కదా. బ్రాహ్మణఋషి అయిన శుక్రుని కూతురుని ఎలా పెళ్ళాడాడు. రాజైనవాడు రాచ కన్యను వివాహం చేసుకోడం పద్దతి. అలా కాకుండగ బ్రాహ్మణ కన్యను పొందుట పద్దతి కాదు కదా.”