పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : విశ్వామిత్రుని వృత్తాంతము

  •  
  •  
  •  

9-504-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జియను వానికి రాజేంద్ర! యేనూఱు-
కొడుకులు గలిగిరి ఘోరబలులు
వేల్పులెల్లను వచ్చి వేఁడిన నా రజి-
దైత్యులఁ బెక్కండ్ర రణిఁ గూల్చి
నాకంబు దేవేంద్రుకు నిచ్చె నిచ్చిన-
జికాళ్ళకెఱిఁగి సుప్రభుండు
వెండియు నతనికి విబుధగేహము నిచ్చి-
సంతోషబుద్ధి నర్చన మొనర్చె

9-504.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నంతనా రజి మృతుఁడైన నతని పుత్రు
మరవిభుఁడు తమ్ము డిగికొనిన
నీక యింద్రలోక; మేలిరి యాగభా
ములు పుచ్చికొనిరి ర్వమంది.

టీకా:

రజి = రజి; అను = అనెడి; వాని = అతని; కిన్ = కి; రాజేంద్రా = మహారాజా; ఏనూఱు = ఐదువందలమంది (500); కొడుకులున్ = పుత్రులు; కలిగిరి = పుట్టిరి; ఘోర = భీకరమైన; బలులు = బలశాలులు; వేల్పులు = దేవతలు; ఎల్లను = అందరు; వచ్చి = చేరి; వేడినన్ = కోరగా; ఆ = ఆ; రజి = రజి; దైత్యులన్ = రాక్షసులను; పెక్కండ్రన్ = అనేకులను; ధరణిగూల్చి = నేలకూల్చి; నాకంబున్ = స్వర్గమును; దేవేంద్రున్ = ఇంద్రున; కున్ = కు; ఇచ్చెన్ = ఇచ్చెను; ఇచ్చిన = ఇచ్చినట్టి; రజి = రజి యొక్క; కాళ్లు = పాదముల; కున్ = కు; ఎఱిగి = మ్రొక్కి; సురప్రభుండు = ఇంద్రుడు {సురప్రభువు - దేవతలరాజు, ఇంద్రుడు}; వెండియున్ = ఇంకను; అతని = అతని; కిన్ = కి; విబుధగేహమున్ = పాలనాధికారము {విబుధగేహము - దివ్యమైన (అధికారకేంద్రమైన) గృహమును, పాలనాధికారము}; ఇచ్చి = ఇచ్చి; సంతోష = సంతోషముగల; బుద్ధిన్ = మనసుతో; అర్చనమున్ = సేవించుట; ఒనర్చెన్ = చేసెను; అంతన్ = అప్పుడు; ఆ = ఆ.
రజి = రజి; మృతుండు = మరణించినవాడు; ఐనన్ = కాగా; అతని = అతని యొక్క; పుత్రులు = కొడుకులు; అమరవిభుడు = ఇంద్రుడు {అమరవిభుడు - దేవతలప్రభువు, ఇంద్రుడు}; తమ్మున్ = వారని; అడిగికొనినను = అర్థించినను; ఈక = ఇయ్యకుండగ; ఇంద్రలోకమున్ = స్వర్గమును; ఏలిరి = పాలించిరి; యాగభాగములున్ = హవిర్భాగములను; పుచ్చికొనిరి = తీసుకొనిరి; గర్వమున్ = మదము; అంది = పొంది.

భావము:

పరీక్షిన్మహారాజా! రజికి ఐదువందలమంది గొప్ప బలశాలులైన కొడుకులు పుట్టారు. దేవతలు వచ్చి కోరగా, ఆ రజి పలువురు రాక్షసులను నేలకూల్చి స్వర్గాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు. అప్పుడు రజి పాదాలకు మ్రొక్కి, ఇంద్రుడు అతనికి స్వర్గాన్ని కాపాడే అధికారం అప్పగించి సేవిస్తున్నాడు. ఆ రజి మరణించాకా అతని కొడుకులు ఇంద్రుడు కోరినా స్వర్గాన్ని ఇవ్వకుండ హవిర్భాగాలు తీసుకుంటూ గర్వంతో స్వర్గాన్ని పాలించసాగారు.