పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : విశ్వామిత్రుని వృత్తాంతము

  •  
  •  
  •  

9-498-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దీర్ఘతపుని కధికుఁడు
శ్రీయితాంశమునఁ బుట్టె సేవ్యుం డాయు
ర్వేజ్ఞఁడు ధన్వంతరి
ఖేదంబులు వాయు నతనిఁ గీర్తనచేయన్.

టీకా:

ఆ = ఆ; దీర్ఘతపుని = దీర్ఘతపని; కిన్ = కి; అధికుడు = గొప్పవాడు; శ్రీదయిత = విష్ణువు {శ్రీదయిత - లక్ష్మీదేవి భర్త, విష్ణువు}; అంశమునన్ = అంశతో; పుట్టెన్ = జన్మించెను; సేవ్యుండు = సేవింపదగినవాడు; ఆయుర్వేదజ్ఞుడు = వైద్యముతెలిసినవాడు; ధన్వంతరి = ధన్వంతరి; ఖేదంబులున్ = దుఃఖములు; వాయున్ = తొలగిపోవును; అతనిన్ = అతనిని; కీర్తన = స్తుతించుట; చేయన్ = చేసినచో .

భావము:

ఆ దీర్ఘతపునికి వైష్ణవ అంశతో ఆయుర్వేదం తెలిసిన మహానుభావుడు ధన్వంతరి జన్మించాడు. ఆయనను సేవిస్తే సకల దుఃఖాలు తొలగిపోతాయి.