పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : విశ్వామిత్రుని వృత్తాంతము

  •  
  •  
  •  

9-496-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"పాడి చెడక వీఁడు నేఁడు మీకతమునఁ
గొడుకు గలిగె నాకుఁ గొడుకులార!
డుపులార! మీరు గొడుకులఁ గనుఁ డింక
బ్రీతితోడ దేవరాతుఁ గూడి."

టీకా:

పాడి = పద్ధతి; చెడక = తప్పక; వీడు = ఇతను; నేడున్ = ఇతను; మీ = మీ; కతమునన్ = వలన; కొడుకున్ = పుత్రుడుగా; కలిగెన్ = కలిగెను; నా = నా; కున్ = కు; కొడుకులారా = పుత్రులూ; కడుపులారా = జాతులూ; మీరున్ = మీరు; కొడుకులన్ = పుత్రులను; కనుడు = పుట్టించండి; ఇంకన్ = ఇకనుండి; ప్రీతి = ప్రేమ; తోడన్ = పూర్వకముగ; దేవరాతున్ = దేవరాతునితో; కూడి = కలిసి .

భావము:

“పుత్రులారా! మీరు ధర్మం తప్పక నడుచుకున్నారు. కనుక నాకు మరో పుత్రుడు కలిగాడు. ఇకనుండి ఈ దేవరాతుడు, మీరు ఒద్దికగా, ప్రేమ పూర్వకంగా ఉండి, పుత్రులను పుట్టించండి.”