పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : విశ్వామిత్రుని వృత్తాంతము

  •  
  •  
  •  

9-495-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అయ్యెడ నతని శాపంబునకు వెరచి, యా నూర్వురయందు మధ్యముండైన మధుచ్ఛందుం డేఁబండ్రు దమ్ములుం దానును నమస్కరించి “తండ్రీ నీచెప్పిన క్రమంబున శునశ్శేపుండు మా కన్న యని మన్నింపంగలవార” మనవుడు సంతసించి మంత్రదర్శియైన శునశ్శేపుని వారల యందుఁ బెద్దఁజేసి, మధుచ్ఛందున కిట్లనియె.

టీకా:

ఆ = ఆ; ఎడన్ = సమయము నందు; శాపంబున్ = శాపమున; కున్ = కు; వెరచి = బెదిరి; ఆ = ఆ; నూర్వుర = వందమంది; అందున్ = లోను; మధ్యముండు = నడుమవాడు; ఐన = అయిన; మధుచ్ఛందుండు = మధుచ్ఛందుడు; ఏబదండ్రున్ = ఏభైమంది (5); తమ్ములున్ = తమ్ములును; తానున్ = అతను; నమస్కరించి = మ్రొక్కి; తండ్రీ = తండ్రీ; నీ = నీవు; చెప్పిన = చెప్పినట్టి; క్రమంబునన్ = విధముగ; శునశ్శేపుండున్ = శునశ్శేపుడు; మా = మా; కున్ = కు; అన్న = అన్న; అని = అనుచు; మన్నింపగలవారము = గౌరవించెదము; అనవుడు = అనగా; సంతసించి = సంతోషించి; మంత్రదర్శి = మంత్రసిద్ధి; ఐన = అయిన; శునశ్సేపుని = శునశ్శేపుని; వారల = వారి; అందున్ = లో; పెద్దన్ = పెద్దవానిగా; చేసి = నియమించి; మధుచ్ఛందున్ = మధుచ్ఛందున; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఆ సమయంలో ఆ శాపానికి బెదిరి ఆ వందమంది లోను నడిమవాడైన మధుచ్ఛందుడు ఏభైమంది తమ్ములతో వచ్చి మ్రొక్కి, “తండ్రీ! నీవు చెప్పినట్టే శునశ్శేపుని మా అన్నగా గౌరవిస్తాం” అన్నాడు. సంతోషించి మంత్రసిద్ధి పొందిన శునశ్శేపుని వారిలో పెద్దవానిగా నియమించి, మధుచ్ఛందునితో ఇలా అన్నాడు.