పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : విశ్వామిత్రుని వృత్తాంతము

  •  
  •  
  •  

9-494-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఇతఁ డన్నఁటపో మాకును
గృకృత్యుల మయితి" మనుచు గేలి యొనర్పన్
సుతులన్ "మ్లేచ్ఛులు గం"డని
ధృతిలేక శపించెఁ దపసి తిరుగుడుపడఁగన్.

టీకా:

ఇతడున్ = ఇతగాడు; అన్న = పెద్ద సోదరుడు; అట = అట; పో = పోయి పోయి; మా = మా; కునున్ = కు; కృతకృత్యులమున్ = ధన్యులము; అయితిమి = అయిపోతిమి; అనుచున్ = అనుచు; గేలి = పరిహాసము; ఒనర్పన్ = చేయగా; సుతులన్ = పుత్రులను; మ్లేచ్ఛులు = పాపరతులు; కండు = అయిపోండి; అని = అని; ధృతిలేక = తట్టుకొనలేక; శపించెన్ = శాపమిచ్చెను; తపసి = ఋషి; తిరుగుడుపడగన్ = పరిభ్రమించేలా.

భావము:

“ఇతగాడు మాకు పెద్దఅన్నట. మేం ధన్యులం అయిపోయాం” అంటూ పరిహాసాలు ఆడారు. విశ్వామిత్రుడు బాధపడి పుత్రులను మ్లేచ్చు అయిపోండి అని శపించాడు.