పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : విశ్వామిత్రుని వృత్తాంతము

  •  
  •  
  •  

9-493-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"కన్నులఁ గంటిని వీనిని
న్నన కొమరుండు నాకు క్కువ మీరో
న్నన్న యనుచు నీతని
న్నింపుం" డనినఁ జూచి దసంయుతులై.

టీకా:

కన్నులన్ = కళ్లతో; కంటిని = చూసితిని; వీనిని = ఇతనిని; మన్ననన్ = ఆదరముతో; కొమరుండున్ = కొడుకు; నా = నా; కున్ = కు; మక్కువన్ = ప్రీతితో; మీరున్ = మీరు; ఓ = ఓయ్; అన్న = అన్న; అన్న = అన్న; అనుచున్ = అనుచు; ఈతనిన్ = ఇతనిని; మన్నింపుడు = గౌరవింపుడు; అనినన్ = అనగా; చూచి = చూసి; మద = గర్వముతో; సంయుతులు = మిక్కిలి కూడినవారు; ఐ = అయ్యి.

భావము:

“ఈ పుణ్యాత్ముడిని కళ్లరా చూసాను. నేను ఇతణ్ణి ప్రీతితో కొడుకుగా భావిస్తున్నాను. మీరు అన్న అంటూ ఇతణ్ణి గౌరవించండి.” విశ్వామిత్రుని కొడుకుల గర్వించి ఇలా అన్నారు.