పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పరశురాముని కథ

  •  
  •  
  •  

9-491-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వంతుఁడు హరి యీ క్రియ
భృగుకులమునఁ బుట్టి యెల్ల పృథివీపతులన్
తీభారము వాయఁగఁ
గొని పలుమాఱుఁ జంపె వరమున నృపా!

టీకా:

భగవంతుడు = విష్ణువు; హరి = విష్ణువు; ఈ = ఈ; క్రియన్ = విధముగ; భృగుకులమునన్ = భృగు వంశము నందు; పుట్టి = అవతరించి; ఎల్ల = అందరు; పృథవీపతులను = రాజులను {పృథివీపతి - భూమికి భర్త, రాజు}; జగతీభారమున్ = భూభారమును; వాయగన్ = తొలగించుటకు; పగగొని = పగబట్టి; పలుమాఱున్ = అనేకసార్లు; చంపెన్ = పరిమార్చెను; బవరమునన్ = యుద్ధము నందు; నృపా = రాజా.

భావము:

పరీక్షిత్తూ! ఈ విధంగ విష్ణుమూర్తి భృగువంశంలో భూభారం తొలగించుటకు అవతరించి యుద్ధంలో రాజులు అందరిని పగబట్టి అనేకసార్లు పరిమార్చాడు.