పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పరశురాముని కథ

  •  
  •  
  •  

9-489-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మదగ్నితనూజుఁడు
రాజీవాక్షుండు ఘనుఁడు రాముఁ డధికుఁడై
యోను సప్తర్షులలో
రాజిల్లెడు మీఁది మనువు రా నవ్వేళన్.

టీకా:

ఆ = ఆ; జమదగ్ని = జమదగ్ని; తనూజుడు = కొడుకు; రాజీవాక్షుండు = పద్మనేత్రుడు; ఘనుడు = గొప్పవాడు; రాముడు = పరశురాముడు; అధికుడు = గొప్పవాడు; ఐ = అయ్యి; ఓజను = ఓజస్సుతో; సప్తర్షులు = సప్తర్షులలో; రాజిల్లెడున్ = విలసిల్లును; మీది = రాబోవు; మనువు = మనువు; రాన్ = వచ్చెడి; ఆ = ఆ; వేళన్ = కాలమునందు.

భావము:

రాబోయే మన్వంతరంలో ఆ జమదగ్ని కొడుకు, పద్మనేత్రుడు, మహానుభావుడు, పరశురాముడు సప్తర్షులలో ఒకడిగా ప్రకాశిస్తాడు.