పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పరశురాముని కథ

  •  
  •  
  •  

9-488-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్తుఁడగు పుత్రువలనను
బ్రాప్తతనుం డగుచుఁ దపము లిమిని మింటన్
ప్తర్షిమండలంబున
ప్తముఁడై వెలుఁగుచుండె మదగ్ని నృపా!

టీకా:

ఆప్తుడు = నిజమైన; పుత్రు = కుమారుని; వలనను = వలన; ప్రాప్త = పొందిన; తనుండు = సంకల్ప శరీరము కలవాడు; అగుచున్ = అయ్యి; తపము = తపస్సు యొక్క; బలిమిని = శక్తివలన; మింటన్ = ఆకాశము నందు; సప్తర్షిమండలంబునన్ = సప్తర్షిమండలమున {సప్తర్షి మండలము - సప్తర్షులు నక్షత్రముల రూపముననుండెడి మండలము,}; సప్తముడు = ఏడవవాడు {సప్తర్షులు - 1కశ్యపుడు 2అత్రి 3భరద్వాజుడు 4విశ్వామిత్రుడు 5గౌతముడు 6వసిష్టుడు 7జమదగ్ని}; ఐన = అయ్యి; వెలుగుచుండెన్ = ప్రకాశించుచుండెను; జమదగ్ని = జమదగ్ని; నృపా = రాజా.

భావము:

“పరీక్షిన్మహారాజా! వంశోద్ధారకుడు అయిన కుమారుని వలన సంకల్ప శరీరం పొంది జమదగ్ని తన తపో శక్తివలన ఆకాశంలో సప్తర్షిమండలంలో ఏడవ ఋషిగా ప్రకాశిస్తున్నాడు.