పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పరశురాముని కథ

  •  
  •  
  •  

9-486-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

య్య పగకు రాముఁ లయక రాజుల
నిరువదొక్కమాఱు సి చంపె;
గతిమీఁద రాజబ్దంబు లేకుండ
సూడు దీర్పలేని సుతుఁడు సుతుఁడె?

టీకా:

అయ్య = తండ్రి; పగ = పగ; కున్ = కోసము; రాముడు = పరశురాముడు; అలయక = విసుగు లేకుండ; రాజులన్ = రాజులను; ఇరువదొక్క = ఇరవైఒక్క (21); మాఱున్ = సార్లు; అరసి = వెతికి; చంపెన్ = సంహరించెను; జగతి = భూమి; మీద = మీద; రాజ = రాజు అనెడి; శబ్దంబున్ = పలుకే; లేకుండన్ = లేకుండ పోవునట్లుగ; సూడు = పగ; తీర్చలేని = తీర్చలేనట్టి; సుతుడు = పుత్రుడు; సుతుడె = పుత్రుడా, కాదు.

భావము:

తండ్రి పగ కోసం భూమి మీద క్షత్రియుడు అనే శబ్దం వినబడనీయకుండా, పరశురాముడు విసుగు విరామం లేకుండా ఇరవైఒక్క సార్లు రాజులను వెతికి మరీ సంహరించాడు. తండ్రి పగ తీర్చలేని కొడుకూ కొడుకేనా.