పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పరశురాముని కథ

  •  
  •  
  •  

9-483-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"డువనేల తండ్రి తను వేమఱకుండుఁడు తోడులార! నే
సూడిదె తీర్తు" నంచుఁ బరశుద్యుతిభీముఁడు రాముఁ డుగ్రుఁడై
యోక యర్జునాత్మభవులున్నపురంబున కేఁగి చొచ్చి గో
డాడఁగఁ బట్టి చంపె వడి ర్జునజాతుల బ్రహ్మఘాతులన్.

టీకా:

ఏడువన్ = ఏడవటం; ఏలన్ = ఎందుకు; తండ్రి = తండ్రి యొక్క; తనువున్ = శరీరమును; ఏమఱకకుండుడు = జాగర్తగ చూస్తూ ఉండండి; తోడులారా = సోదరులారా; నేన్ = నేను; సూడు = పగ; ఇదె = ఇదిగో ఇప్పుడే; తీర్తున్ = తీర్చుకొనెదను; అంచున్ = అనుచు; పరశు = గొడ్డలి; ద్యూతి = పదునుగల; భీముడు = భయంకరుడు; రాముడు = పరశురాముడు; ఉగ్రుడు = కోపముగలవాడు; ఐ = అయ్యి; ఓడక = వెనుదీయక; అర్జును = కార్తవీర్యర్జునుని; ఆత్మభవులు = పుత్రులు {ఆత్మభవులు - తనకు పుట్టినవారి, పుత్రులు}; ఉన్న = ఉన్నట్టి; పురంబున్ = నగరమున; కున్ = కు; ఏగి = వెళ్లి; చొచ్చి = ప్రవేశించి; గోడాడగన్ = గోలచేయుచుండగ; పట్టి = పట్టుకొని; చంపెన్ = సంహరించెను; వడిన్ = వేగముగా; అర్జును = కార్తవీర్యర్జునుని; జాతులన్ = పుత్రులను; బ్రహ్మఘాతులన్ = బ్రహ్మహత్యాపాతకులను.

భావము:

“అన్నలారా! ఎందుకు ఏడుస్తారు. తండ్రి శరీరాన్ని జాగ్రత్తగా చూస్తుండండి. ఇదిగో ఇప్పుడే పోయి నేను పగ తీర్చుకుంటాను” అంటూ పరశువు (గొడ్డలి) పట్టుకుని పరశురాముడు కోపంతో బ్రహ్మహత్యాపాతకులైన కార్తవీర్యర్జునుని కొడుకులు ఉన్న నగరానికి వెళ్లాడు. వాళ్ళు గోలపెట్టసాగారు. రాముడు వారిని పట్టుకొని సంహరించాడు.