పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పరశురాముని కథ

  •  
  •  
  •  

9-481-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"వాకిలివెడలవు కొడుకులు
రాకుండఁగ నట్టి నీవు రాజసుతులచేఁ
జీకాకు నొంది పోవఁగ
నీకా ళ్లెట్లాడెఁ దండ్రి! నిర్జరపురికిన్."

టీకా:

వాకిలిన్ = గుమ్మము; వెడలవు = దాటి వెళ్లవు; కొడుకులు = పుత్రులు; రాకుండన్ = రాకుండగా; అట్టి = అటువంటి; నీవు = నీవు; రాజసుతుల = రాకుమారుల; చేన్ = వలన; చీకాకున్ = చీకాకులు; ఒంది = పడి; పోవగన్ = పోవుటకు; నీ = నీకు; కాళ్ళు = కాళ్ళు; ఎట్లు = ఎలా; ఆడెన్ = కదిలినవి; తండ్రి = తండ్రి; నిర్జరపురి = స్వర్గమున; కిన్ = కు.

భావము:

“తండ్రీ! కొడుకులం మేం తోడు రాకుండా గుమ్మం దాటి వెళ్లవు. అటువంటి నీవు రాకుమారుల వలన చీకాకులు పడి స్వర్గానికి పోడానికి నీకు కాళ్ళు ఎలా వచ్చాయి.”