పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పరశురాముని కథ

  •  
  •  
  •  

9-477.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిరుపమధ్యానసుఖవృత్తి నిలిచియున్న
పుణ్యు జమదగ్నినందఱు బొదివి పట్టి
కుదులకుండంగఁ దలఁ ద్రెంచి కొనుచుఁ జనిరి
డ్డ మేతెంచి రేణుక డచికొనఁగ.

టీకా:

పరశురామున్ = పరశురాముని; కిన్ = కి; ఓడి = ఓడిపోయి; పరుగులుపెట్టిన = పారిపోయిన; అర్జును = కార్తవీర్యార్జునుని; పుత్రకులు = కుమారులు; ఆత్మ = మనసుల; అందున్ = లో; తండ్రి = తండ్రి; మ్రగ్గుట = మరణమున; కున్ = కు; సంతప్తులు = బాధపడినవారు; ఐ = అయ్యి; పొగలుచున్ = దుఃఖించుచు; ఇంతటనంతటన్ = అక్కడనిక్కడ; ఎడరు = అదనుకోసము; వేచి = ఎదురుచూసి; తిరిగి = వర్తిల్లుచు; ఆడుచున్ = కనిపెట్టుకొనియుండి; ఒక్క = ఒకానొక; దివసము = దినము; అందున్ = అందు; ఆ = ఆ; రాముడు = పరశురాముడు; అడవి = అడవి; కిన్ = కి; అన్నల = సోదరుల; తోడన్ = తోటి; అరుగన్ = వెళ్ళిన; పిదపన్ = తరువాత; పగతీర్పన్ = పగతీర్చుకొనుటకు; తఱి = తగిన సంయము; అని = అని; పఱతెంచి = వచ్చి; హోమాలయంబునన్ = యాగశాలలో; సర్వేశున్ = భగవంతుని; ఆత్మన్ = మనసులో; నిలిపి = ధారణచేసి .
నిరుపమ = సాటిలేని; ధ్యాన = ధ్యానమునందలి; సుఖ = ఆనందపు; వృత్తిని = స్థితిలో; నిలిచి = స్థిరముగ; ఉన్న = ఉన్నట్టి; ఫుణ్యున్ = పుణ్యుని; జమదగ్నిన్ = జమదగ్నిని; అందఱున్ = అందరుకలిసి; పొదివిపట్టి = పొదవిపట్టుకొని; కుదులకుండంగ = చలించక, లెక్కచేయక; తలన్ = శిరస్సును; త్రెంచికొనుచు = తెగగొట్టి; చనిరి = వెళ్ళిపోయిరి; అడ్డము = ఆపుటకు; ఏతెంచి = వచ్చి; రేణుక = రేణుక; అడచికొనగన్ = మొత్తుకొనగా .

భావము:

పరశురామునికి ఓడి పారిపోయిన కార్తవీర్యార్జునుని కుమారులు తండ్రి మరణానికి బాధపడి, దుఃఖిస్తూ అదనుకోసం కనిపెట్టుకొని ఉన్నాకు. ఒకనాడు పరశురాముడు సోదరులతో అడవికి వెళ్ళగా, పగతీర్చుకోడానికి తగిన సమయం అని వచ్చి, రేణుక మొత్తుకున్నా వినకుండా, యాగశాలలో ధ్యానంలో ఉన్న జమదగ్నిని అందరు కలిసి తల నరికి వెళ్ళిపోయారు.