పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పరశురాముని కథ

  •  
  •  
  •  

9-475-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మెచ్చిన తండ్రిని గనుఁగొని
చెచ్చెర "నీ పడినవారి జీవంబులు నీ
విచ్చితి" నను మని మ్రొక్కిన
నిచ్చెన్ వారలును లేచి రెప్పటి భంగిన్.

టీకా:

మెచ్చిన = మెచ్చుకున్న; తండ్రిని = తండ్రిని; కనుగొని = చూసి; చెచ్చెరన్ = వెంటనే; ఈ = ఈ; పడిన = చనిపోయిన; వారి = వారి యొక్క; జీవంబులున్ = ప్రాణములు; నీవున్ = నీవు; ఇచ్చితిని = ఇచ్చాను; అనుము = అనవలసినది; అని = అని; మ్రొక్కినన్ = ప్రార్థించగా; ఇచ్చెన్ = తిరిగి ఇచ్చివేసెను; వారలునున్ = వారును; లేచిరి = లేచి నిలబడిరి; ఎప్పటి = ఎప్పటి; భంగిన్ = లాగనే.

భావము:

అలా మెచ్చుకొన్న తండ్రి జమదగ్నిని రాముడు, “ఇలా చనిపోయిన వీరి ప్రాణాలు ప్రసాదించు.” అని ప్రార్థించాడు. ఆయన వారి ప్రాణాలు తిరిగి అనుగ్రహించాడు. వారు ఎప్పటిలా లేచి నిలిచారు.