పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పరశురాముని కథ

  •  
  •  
  •  

9-470-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చిత్తమున భార్య దడసిన
వృత్తాంతం బెఱిఁగి తపసి వేకని సుతులన్
"మత్తం దీనిం జావఁగ
మొత్తుం" డన మొత్తరైరి మునుకుచు వారల్.

టీకా:

చిత్తమునన్ = మనసు నందు; భార్య = పెండ్లాము; తడసిన్ = జాగుచేసిన; వృత్తాంతంబున్ = సంగతిని; ఎఱిగి = తెలిసికొని; తపసి = ముని; వేన్ = శీఘ్మముగా; కని = చూసి; సుతులన్ = పుత్రులను; మత్తన్ = మదించిన; దీనిన్ = ఈమెను; చావగన్ = చచ్చేటట్టు; మొత్తుండు = కొట్టండి; అనన్ = అనగా; మొత్తరు = చంపకుండని వారు; ఐరి = అయ్యిరి; మునుకుచున్ = బాధపడిపోతూ; వారల్ = వారు.

భావము:

ముని భార్య జాగుచేసిన సంగతి గ్రహించాడు. జమదగ్ని కొడుకులతో “మదించిన ఈమెను చావగొట్టండి.” అన్నాడు. వారు దుఃఖిస్తూ తల్లిని చంపలేకపోయారు.