పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పరశురాముని కథ

  •  
  •  
  •  

9-468-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"క్కట వచ్చి పెద్దతడ య్యెను; హోమమువేళ దప్పె; నే
నిక్కడనేల యుంటి; ముని యేమనునో" యని భీతచిత్త యై
గ్రక్కునఁ దోయకుంభము శిస్థలమందిడి తెచ్చియిచ్చి వే
మ్రొక్కి కరంబు మోడ్చి పతి ముందట నల్లన నిల్చె నల్కుచున్.

టీకా:

అక్కట = అయ్యో; వచ్చి = ఇక్కడకువచ్చి; పెద్ద = చాలా; తడవు = సమయము; అయ్యెను = గడచిపోయినది; హోమము = హోమము చేసెడి; వేళ = సమయము; తప్పెన్ = దాటిపోయినది; నేన్ = నేను; ఇక్కడ = ఇక్కడ; ఏలన్ = ఎందుకు; ఉంటిన్ = ఉండిపోతిని; ముని = ఋషి; ఏమి = ఏమి; అనునో = దెబ్బలాడునో; అని = అని; భీత = భయము చెందిన; చిత్త = మనసు కలామె; ఐ = అయ్యి; క్రక్కునన్ = గబుక్కున; తోయ = నీటి; కుంభమున్ = కుండను; శిరస్థలము = తలపై; ఇడి = ఉంచి; తెచ్చి = తీసుకొని వచ్చి; ఇచ్చి = ఇచ్చి; వే = వేగముగ; మ్రొక్కి = నమస్కరించి; కరంబున్ = చేతులు; మోడ్చి = జోడించి; పతి = భర్త; ముందటన్ = ఎదురుగ; నల్లన = మెల్లిగ; నిల్చెన్ = నిలబడెను; అల్కుచున్ = బెదురుతూ.

భావము:

“అయ్యో! ఇక్కడకు వచ్చి చాలాసేపు అయింది. హోమం చేసే సమయం దాటిపోయింది. నేను ఎందుకిలా ఉండిపోయాను. ఋషి ఏమంటాడో?” అని రేణుక భయపడింది. వెంటనే నీటికుండ నెత్తికెత్తుకు వచ్చింది. భర్త ఎదురుగ చేతులు జోడించి బెదురుతూ నిలబడింది.