పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పరశురాముని కథ

  •  
  •  
  •  

9-466-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యెడ నొక్కనాఁడు సలిలార్థము రేణుక గంగలోనికిం
బోయి ప్రవాహమధ్యమునఁ బొల్పుగ నచ్చరలేమపిండుతోఁ
దోవిహారముల్ సలుపు దుర్లభుఁ జిత్రరథున్ సరోజమా
లాయుతుఁ జూచుచుండెఁ బతి యాజ్ఞ దలంపక కొంత ప్రేమతోన్.

టీకా:

ఆ = ఆ; ఎడన్ = సమయమునందు; ఒక్క = ఒకానొక; నాడున్ = దినమున; సలిల = మంచినీటి; అర్థమున్ = కోసము; రేణుక = రేణుక; గంగ = గంగానది; లోని = లోపలి; కిన్ = కి; పోయి = వెళ్ళి; ప్రవాహము = నది; మధ్యమునన్ = నడుమ; పొల్పుగన్ = చక్కగ; అచ్చర = అప్సరస; లేమల = స్త్రీల; తోన్ = తోటి; తోయ = జల; విహారముల్ = క్రీడలు; సలుపు = చేయుచున్న; దుర్లభున్ = అందరానివాడు; చిత్రరథున్ = చిత్రరథుని; సరోజ = పద్మముల; మాలా = మాల; ఆయుతున్ = కలవానిని; చూచుచుండె = చూస్తూ ఉండిపోయెను; పతి = భర్త; ఆజ్ఞన్ = ఆనతిని; తలంపక = మరచిపోయి; కొంత = కొంచము; ప్రేమ = ప్రేమ; తోన్ = తోటి.

భావము:

పిమ్మట ఒకనాడు మంచినీటికి జమదగ్ని భార్య రేణుక గంగానదికి వెళ్ళింది. భర్త ఆనతిని మరచి, నదిలో తామరపూల మాల ధరించి అప్సరసలతో క్రీడిస్తున్న గంధర్వుడు చిత్రరథుని చూస్తూ ఉండిపోయింది.