పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పరశురాముని కథ

  •  
  •  
  •  

9-463-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్ష గలిగిన సిరి గలుగును
క్ష గలిగిన వాణి గలుగు సౌరప్రభయున్
క్ష గలుగఁ దోన కలుగును
క్ష గలిగిన మెచ్చు శౌరి దయుఁడు దండ్రీ!

టీకా:

క్షమ = ఓరిమి; కలిగిన = ఉన్నచో; సిరి = సంపదలు; కలుగును = కలుగుతాయి; క్షమ = తాలిమి; కలిగిన = ఉన్నచో; వాణి = విద్య; కలుగున్ = అబ్బును; సౌర = సూర్యుడు అంతటి; ప్రభయున్ = ప్రకాశము; క్షమ = తాలిమి; కలుగన్ = ఉన్నచో; తోనన్ = దానితోపాటు; కలుగును = కలుగును; క్షమ = తాలిమి; కలిగిన = ఉన్నచో; మెచ్చు = సంతోషించును; శౌరి = విష్ణువు {శౌరి - శూరుని యొక్క మనుమడు, విష్ణువు}; సదయుండు = దయామయుడు; తండ్రి = నాయనా.

భావము:

నాయనా! ఓరిమి ఉంటేనే సంపదలు కలుగుతాయి. తాలిమి ఉంటేనే విద్య అబ్బుతుంది. క్షమ ఉంటేనే సూర్యుడంతటి ప్రకాశం కలుగుతుంది. క్షమ కలిగి ఉంటే దయామయుడు విష్ణుమూర్తి సంతోషిస్తాడు.