పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పరశురాముని కథ

  •  
  •  
  •  

9-461-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"కవేల్పు లెల్లఁ దమతమ
చెలువంబులు దెచ్చి రాజుఁ జేయుదు రకటా!
లువేల్పు రాజు వానిం
ముననిట్లేల పోయి చంపితి పుత్రా!

టీకా:

కలవేల్పులు = ఉన్న అందరు దేవతలు; తమతమ = వారి వారి; చెలువంబులున్ = అంశములను; తెచ్చి = తీసుకొని వచ్చి; రాజున్ = రాజును; చేయుదురు = పుట్టించెదరు; అకట = అయ్యో; పలు = అనేక; వేల్పు = దేవతల స్వరూపి; రాజు = రాజు; వానిన్ = అట్టివానిని; చలమునన్ = పంతముపట్టి; ఇట్లు = ఇలా; ఏల = ఎందుకు; పోయి = వెళ్లి; చంపితి = చంపివేసితివి; పుత్రా = కుమారా.

భావము:

“అయ్యో! కుమారా! అందరు దేవతలు తమ అంశాలు తెచ్చి రాజును పుట్టిస్తారు. అలాంటి సర్వ దేవతాస్వరూపి రాజును పంతముపట్టి చంపేసావు కదా.