పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పరశురాముని కథ

  •  
  •  
  •  

9-460-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు హోమధేనువు మరలం దెచ్చియిచ్చి తన పరాక్రమంబు దండ్రి దోబుట్టువులకుం దెలియం జెప్పిన జమదగ్ని రామున కిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; హోమధేనువున్ = యజ్ఞగోవును; మరలన్ = వెనుకకు; తెచ్చి = తీసుకువచ్చి; ఇచ్చి = ఇచ్చి; తన = తన యొక్క; పరాక్రమంబున్ = పరాక్రమమును; తండ్రి = తండ్రికి; తోబుట్టువుల్ = సోదరుల; కున్ = కు; తెలియచెప్పినన్ = వివరించగా; జమదగ్ని = జమదగ్ని; రామున్ = పరశురాముని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఈ విధంగా యాగధేనువునును తిరిగి తెచ్చి ఇచ్చి తన పరాక్రమాన్ని తండ్రికి సోదరులకు వివరించగా, జమదగ్ని పరశురామునితో ఇలా అన్నాడు.