పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పరశురాముని కథ

  •  
  •  
  •  

9-450-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త్తిల్లి భూతజాలము
చిత్తంబులఁ జొక్కి వేడ్కఁ జిందులుబాఱన్
జొత్తిల్లి సమిత్తలమున
నెత్తురు మేదంబు పలలనికరం బయ్యెన్.

టీకా:

మత్తిల్లి = మత్తెక్కి; భూత = పిశాచ; జాలమున్ = గణములు; చిత్తంబులన్ = మనసులలో; చొక్కి = సోలి; వేడ్కన్ = సంతోషములతో; చిందుల = చిందులు; పాఱన్ = తొక్కగ; జొత్తిల్లి = ఎఱ్ఱబారిపోయి; సమిత్ = యుద్ధ; తలమునన్ = రంగము నందు; నెత్తురున్ = రక్తము; మేదంబు = మెదళ్ళు; పలల = మాంసముల; నికరంబున్ = నిండినది; అయ్యెన్ = అయినది.

భావము:

అప్పుడు, యుద్ధ రంగం రక్తంతో ఎఱ్ఱబారిపోయింది. మెదళ్ళు మాంసాల నిండింది. పిశాచాలు మత్తెక్కి ఆనందపారవశ్యంతో సోలి, సంతోషంతో చిందులు తొక్కాయి.