పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పరశురాముని కథ

  •  
  •  
  •  

9-448-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"బాలుఁడు వెఱ్ఱి బ్రాహ్మణుఁడు బ్రాహ్మణుకైవడి నుంట మాని భూ
పాలురతోడ భూరిబలవ్యులతోడ భయంబు దక్కి క
య్యాకు వచ్చినాఁడు మన యందిఁకఁ బాపము లేదు లెండులెం
డే సహింప భూసురుని నేయుఁడు వ్రేయుఁడు గూల్పుఁ డిమ్మహిన్."

టీకా:

బాలుడు = పిల్లాడు; వెఱ్ఱి = తెలివితక్కువ; బ్రాహ్మణుడు = విప్రుడు; బ్రాహ్మణున్ = బ్రాహ్మణుని; కైవడిన్ = వలె; ఉంటన్ = ఉండుట; మాని = మానివేసి; భూపాలుర = రాజుల; తోడన్ = తోటి; భూరి = అత్యధికమైన; బల = బలముతో; భవ్యుల = గొప్పవారి; తోడన్ = తోటి; భయంబున్ = భీతి; తక్కి = లేకుండగ; కయ్యాలు = యుద్ధమున; కున్ = కు; వచ్చినాడు = వచ్చాడు; మన = మన; అందు = వద్ద; ఇంక = ఇక; పాపము = తప్పు; లేదు = లేదు; లెండులెండు = లేవండి; ఏలసహింప = సహింప నక్కర లేదు; భూసురుని = బ్రహ్మణుని; ఏయుడు = కొట్టండి; వ్రేయండి = నరకండి; గూల్పుడు = కూలగొట్టండి; ఈ = ఈ; మహిని = నేలమీద.

భావము:

“తెలివితక్కువ బ్రాహ్మణపిల్లాడు. బ్రాహ్మణుడిలా పడి ఉండక తనకేదో గొప్ప బలం ఉందని గర్విస్తున్నాడు. నదురు బెదురు లేకుండా బలశాలురమైన మా వంటి రాజులతో కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. మన తప్పు లేకుండా వచ్చి రెచ్చిపోతున్నాడు. ఇంకా చూస్తూ ఊరుకుంటారేమిటి. లేవండి. ఈ బ్రాహ్మణుణ్ణి నేలకూల్చండి.”