పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పరశురాముని కథ

  •  
  •  
  •  

9-444-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రయాగ్నిచ్ఛట భంగిఁ గుంభి విదళింపం బాఱు సింహాకృతిం
బెలుచన్ రాముఁ డిలేశు వెంట నడచెం బృథ్వీతలంబెల్ల నా
కుమై క్రుంగఁ గుఠారియై కవచియై కోదండియై కాండియై
లియై సాహసియై మృగాజినమనోజ్ఞశ్రోణియై తూణియై.

టీకా:

ప్రళయాగ్ని = ప్రళయకాలపు అగ్ని; ఛట = జ్వాలలు; భంగిన్ = వలె; కుంభిన్ = ఏనుగును {కుంభి – కుంభములు కలది, కరి}; విదళింపన్ = సంహరించుటకు; పాఱు = పలిగెట్టుతున్న; సింహ = సింహపు; ఆకృతిన్ = వంటి; పెలుచన్ = ఆవేశముతో; రాముడు = పరశురాముడు; ఇలేశున్ = రాజు; వెంటనడచెన్ = వెంటపడెను; పృథ్వీతలంబు = భూమండలము; ఎల్లన్ = అంతా; ఆకులము = వ్యాకులపడినది; ఐ = అయ్యి; క్రుంగన్ = కుంగిపోవునట్లు; కుఠారి = గండ్రగొడ్డలి కలవాడు; ఐ = అయ్యి; కవచి = కవచము కలవాడు; ఐ = అయ్యి; కోదండి = విల్లు కలవాడు; ఐ = అయ్యి; కాండి = బాణములు కలవాడు; ఐ = అయ్యి; ఛలి = పెంకితనము కలవాడు; ఐ = అయ్యి; సాహసి = సాహసము కలవాడు; ఐ = అయ్యి; మృగ = జింక; అజిన = చర్మముతో; మనోజ్ఞ = చక్కగా నున్న; శ్రోణి = నడుము కలవాడు; ఐ = అయ్యి; తూణి = అమ్ములపొది కలవాడు; ఐ = అయ్యి.

భావము:

కవచం, విల్లంబులు ధరించాడు; అంబులపొది మూపున కట్టుకున్నాడు; నడుము కున్న జింక చర్మం బిగించుకున్నాడు; గండ్రగొడ్డలి చేతిలో పట్టుకున్నాడు; పెంకితనంతో, సాహసంతో; భూమి దద్దరిల్లేలా అడుగులు వేస్తూ బయలుదేరాడు; ప్రళయకాలాగ్ని జ్వాల వలె, ఏనుగును చంపడానికి పరిగెట్టుతున్న సింహం వలె, పరశురాముడు రాజు వెంటపడ్డాడు.