పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పరశురాముని కథ

  •  
  •  
  •  

9-442-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ద్దిరయ్య! యింట న్నంబు గుడిచి మా
య్య వల దనంగ నాక్రమించి
క్రొవ్వి రాజు మొదవు గొనిపోయినాఁ డంట
యేను రాముఁ డౌట యెఱుఁగఁ డొక్కొ.
"

టీకా:

అద్దిరయ్య = ఔరా; ఇంటన్ = మా ఇంటిలో; అన్నంబు = భోజనము; కుడిచి = తిని; మా = మా యొక్క; అయ్య = తండ్రి; వలదు = వద్దు; అనగన్ = అన్నప్పటికి; ఆక్రమించి = దౌర్జన్యముచేసి; క్రొవ్వి = కొవ్వెక్కి; రాజు = రాజు; మొదవున్ = పశువును; కొనిపోయినాడు = పట్టుకుపోయాడు; అంట = అట; ఏను = నేను; రాముడన్ = రాముడను శూరుడు; ఔట = అయ్యుండుట; ఎఱుగడొక్క = తెలియడేమో.

భావము:

“ఔరా మా ఇంట్లో తిండి తిని మా తండ్రి వద్దన్నా వినకుండా రాజు నని గర్వించి దౌర్జన్యంగా మా కామధేనువును పట్టుకుపోతాడా? ఈ రాముడి సంగతి తెలియడేమో.”