పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పరశురాముని కథ

  •  
  •  
  •  

9-440-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"క్రేపుం బాపకుఁ" డంచును
"నాదలం బడితి" మనుచు "నంబా" యనుచుం
"జూపోవరు నృపు" లంచును
వాపోవన్ మొదవుఁ గొనుచు చ్చిరి పురికిన్.

టీకా:

క్రేపున్ = దూడను; పాపకుడు = దూరము చేయకండి; అంచున్ = అంటు; ఆపదలన్ = ఆపదలలో; పడితిమి = పడిపోయాము; అనుచున్ = అనుచు; అంబా = అంబా; అనుచున్ = అంటు; చూపోరు = చూచి ఓర్వలేరు; నృపులు = రాజులు; అంచునున్ = అనుచు; వాపోవన్ = ఏడ్చుచుండగ; మొదవున్ = గోవును; కొనుచున్ = తీసుకుపోతూ; వచ్చిరి = చేరిరి; పురికిన్ = నగరికి.

భావము:

నన్ను దూడకు దూరం చేయకండి.” అంటు, “ప్రమాదంలో పడ్డానే” అంటూ, “రాజులు ఓర్వలేరు” అంటూ అంబా రావాలు చేస్తూ ఏడుస్తున్న గోవును తమ మహిష్మతీ నగరానికి లాక్కుపోసాగారు.