పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పరశురాముని కథ

  •  
  •  
  •  

9-438-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రణీశుఁ డొకనాఁడు దైవయోగంబున-
వేఁటకై కాంతారవీథి కేఁగి
తిరిగి యాఁకట శ్రాంతదేహుఁడై జమదగ్ని-
ముని యాశ్రమముఁజేరి మ్రొక్కి నిలువ
నా మునీంద్రుఁడు రాజు ర్థితోఁ బూజించి-
యా రాజునకు రాజునుచరులకుఁ
న హోమధేనువుఁ డయక రప్పించి-
యిష్టాన్నములు గురియింప నతఁడు

9-438.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గుడిచి కూర్చుండి మొదవుపై గోర్కిఁ జేసి
సంపద యదేల యీ యావు చాలుఁగాక
యిట్టి గోవుల నెన్నండు నెఱుఁగ మనుచుఁ
ట్టి తెండని తమ యొద్ది టులఁ బనిచె.

టీకా:

ధరణీశుడు = రాజు; ఒక = ఒకానొక; నాడు = దినమున; దైవయోగమునన్ = దైవఘటనవలన; వేట = వేటాడుట; కై = కోసము; కాంతార = అటవీ; వీథి = మార్గమున; కిన్ = కు; ఏగి = వెళ్ళి; తిరిగి = సంచరించి; ఆకటన్ = ఆకలితో; శ్రాంత = అలసిన; దేహుడు = శరీరము కలవాడు; ఐ = అయ్యి; జమదగ్ని = జమదగ్ని అనెడి; ముని = ఋషి; ఆశ్రమమున్ = ఆశ్రమము; చేరి = దగ్గరకు వెళ్ళి; మ్రొక్కి = నమస్కరించి; నిలువన్ = నిలబడగా; ఆ = ఆ; ముని = మునులలో; ఇంద్రుడు = ఉత్తముడు; రాజున్ = రాజును; అర్థి = ప్రీతి; తోన్ = తోటి; పూజించి = మర్యాదలుచేసి; ఆ = ఆ; రాజున్ = రాజున; కున్ = కు; రాజు = రాజు యొక్క; అనుచరుల్ = అనుచరుల; కున్ = కు; తన = తన యొక్క; హోమధేనువున్ = యాగపు ఆవును; తడయక = ఆలస్యము చేయక; రప్పించి = తీసుకొని వచ్చి; ఇష్టాన్నములున్ = చక్కటి భోజనములు; కురియింపన్ = సుష్టిగా పెట్టగా; అతడు = అతడు; కుడిచి = తిని ,
కూర్చుండి = కూచుని; మొదవు = ఆవు; పైన్ = మీద; కోర్కిజేసి = కోరిక కలిగి; సంపద = ఉన్న సంపదలు; అదేల = అవన్నీ ఎందుకు; ఈ = ఈ; ఆవు = గోవు; చాలుగాక = చాలునుగాక; ఇట్టి = ఇలాంటి; గోవులన్ = ఆవులను; ఎన్నడున్ = ఎప్పుడు; ఎఱుగము = తెలియము; అనుచున్ = అని; పట్టితెండి = పట్టుకొచ్చేయండి; అని = అని; తమ = వారి; ఒద్ది = దగ్గరున్న; భటులన్ = సేవకులను; పనిచె = పంపించెను.

భావము:

ఆ మహారాజు ఒకనాడు వేటకి అడవికి వెళ్ళాడు. తిరిగి తిరిగి అలసిపోయి, నకనకలాడే ఆకలితో దైవఘటన వలన జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళి నమస్కరించి నిలబడ్డాడు. ఆ ఋషీశ్వరుడు రాజుకు ప్రీతితో మర్యాదలు చేసాడు. తన హోమధేనువును శీఘ్రమే రప్పించి ఆ రాజుకి అనుచరులకి చక్కటి విందు భోజనాలు పెట్టించాడు. తినికూచున్న కార్తవీర్యునికి ఆ కామధేనువు మీద కోరిక కలిగింది. ఇలాంటి గోవు ఒక్కటుంటే చాలు కదా అనుకున్నాడు. ఆ గోవును పట్టి తెమ్మని భటులను ఆఙ్ఞాపించాడు.