పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పరశురాముని కథ

  •  
  •  
  •  

9-434-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వీఁమెయి నతఁడు రావణుఁ
గూఁటులగలించి పట్టికొని మోకాళ్ళం
దాఁకించి కోఁతికైవడి
నాఁకం బెట్టించెఁ గింకరావళిచేతన్.

టీకా:

వీకమెయిన్ = పరాక్రమపూర్తిగా; అతడు = అతను; రావణున్ = రావణుని; కూకటులు = జుట్టు; అగలించి = ఒడిసి; పట్టికొని = పట్టుకొని; మోకాళ్ళన్ = మోకాళ్ళతో; తాకించి = పొడిచి; కోతి = కోతి; కైవడిన్ = వలె; ఆకన్ = చెరలో; పెట్టించెన్ = పెట్టించెను; కింకర = భటుల; ఆవళి = సమూహముల; చేతన్ = చేత;

భావము:

పరాక్రమించి కార్యవీర్యార్జునుడు రావణుని జుట్టు పట్టుకొని, మోకాళ్ళతో పొడిచి, తన భటులచేత కోతిని కట్టివేసినట్లు బంధించి చెరలో పెట్టించాడు.