పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పరశురాముని కథ

  •  
  •  
  •  

9-429-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"టికి జంపె రాముఁడ వనీశులఁ బల్వుర వారి యందు ద
ప్పేటికిఁ గల్గె విప్రుఁ డతఁ డేటికి రాజస తామసంబులన్
వాముఁ బొందె భూభరము వారిత మౌ టది యేవిధంబు నా
మాకు మౌనిచంద్ర! మఱుమాట ప్రకాశముగాఁగఁ జెప్పవే."

టీకా:

ఏటికిన్ = ఎందుకు; చంపెన్ = సంహరించెను; రాముడు = పరశురాముడు; ఈశులన్ = రాజులను; పల్వురన్ = అనేకమందిని; వారి = వారి; అందున్ = ఎడల; తప్పు = తప్పు; ఏటికిన్ = ఏమిటి; కల్గెన్ = జరిగినది; విప్రుడు = బ్రాహ్మణుడు; ఏటికిన్ = ఎందుకు; రాజస = రజోగుణములు; తామసంబులన్ = తామసగుణములను; వాటమున్ = అనుకూలముగా; పొందెన్ = పొందెను; భూ = భూమి యొక్క; భరమున్ = భారము; వారితము = తగ్గినది; ఔట = అగుట; అది = అది; ఏవిధంబున్ = ఏవిధముగా; నా = నా; మాట = ప్రశ్న; కున్ = కు; మౌని = మునులలో; చంద్ర = చంద్రుని వంటివాడ; మఱుమాట = సమాధానమును; ప్రకాశము = విశదము; కాగన్ = అగునట్లు; చెప్పవే = చెప్పుము.

భావము:

ఓ మునీశ్వరా! పరశురాముడు రాజులు అందరిని ఎందుకు సంహరించాడు. వారు చేసిన తప్పు ఏమిటి? బ్రాహ్మణుడు అయి ఉండి ఇలా రజోగుణ, తామస గుణాలు ఎందుకు పొందాడు? దీని వలన భూభారం ఎలా తగ్గినట్లు అవుతుంది? వివరంగా చెప్పు.”