పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పరశురాముని కథ

  •  
  •  
  •  

9-427-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పురుషోత్తము నంశంబున
జమదగ్నికి జనించి న్యుఁడు రాముం
డిరువదియొకపరి నృపతుల
శిములఁ జక్కడిచెఁ దనదు చేగొడ్డంటన్."

టీకా:

పురుషోత్తమున్ = విష్ణుమూర్తి యొక్క; అంశంబునన్ = అంశతో; ధరన్ = భూలోకమున; జమదగ్ని = జమదగ్ని; కిన్ = కి; జనించి = పుట్టి; ధన్యుడు = ధన్యాత్ముడు; రాముండు = రాముడు; ఇరువదియొక = ఇరవైఒక్క (21); పరి = సార్లు; నృపతులన్ = రాజుల యొక్క {నృపతి - నరులకు భర్త, రాజు}; శిరములన్ = తలలను; చక్కడిచెన్ = నరికివేసెను; తనదు = తన యొక్క; చేగొడ్డంటన్ = గండ్రగొడ్డలితో.

భావము:

విష్ణుమూర్తి తన అంశతో పరశురాముడుగా జమదగ్ని ఇంట అవతరించాడు. పరశురాముడు తన యొక్క గండ్రగొడ్డలితో ఇరవైఒక్క సార్లు రాజులు అందరి తలలు నరికేసాడు.”