పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : వైవస్వతమనువు జన్మంబు

  •  
  •  
  •  

9-8.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లజ బంధుని పెండ్లాము సంజ్ఞ యందు
శ్రాద్ధదేవుండు మనువు సంజాతుఁ డయ్యె;
నువునకు శ్రద్ధ యనియెడి గువ యందుఁ
దురు గొడుకులు గలిగిరి ద్రయశులు.

టీకా:

భూమీశ = రాజా {భూమీశుడు - భూమికి ఈశుడు (ప్రభువు), రాజు}; ఆ = ఆ; మహాపురుషుని = గొప్పవాని; నాభి = బొడ్డు; మధ్యమున = మధ్యలో; బంగారు = బంగారపు; కెందమ్మి = ఎఱ్ఱటిపద్మము; మొలచెన్ = పుట్టెను; ఆ = ఆయొక్క; తమ్మిపూవు = పద్మము; లోనన్ = అందు; అటమీద = ఆపైన; తనయంత = తనంతటతనే, స్వయంభువుగా; నాలుగుమోములనలువ = చతుర్ముఖబ్రహ్మ {నాలుగుమోములనలువ - నాలుగు వ, చతుర్ముఖ బ్రహ్మ}; పుట్టెన్ = జన్మించెను; ఆ = ఆయొక్క; బ్రహ్మ = బ్రహ్మదేవుని; మనమున్ = మనసునందు; అట = అక్కడ; మరీచి = మరీచి; జనించెన్ = పుట్టెను; కశ్యపుండు = కశ్యపుడు; అతని = వాని; కిన్ = కి; కలిగెన్ = పుట్టను; అంతన్ = అంతట; ఆ = ఆ; కశ్యపున్ = కశ్యపుడి; కిన్ = కి; దక్ష = దక్షునియొక్క; ఆత్మజ = కుమార్తె {ఆత్మజ - తనకు పుట్టినది, కూతురు}; అదితి = అదితి; కిన్ = కి; కొమరుడు = పుత్రుడు; ఐ = అయ్యి; చీకటిగొంగ = సూర్యుడు {చీకటిగొంగ - చీకటికి గొంగ (శత్రువు), సూర్యుడు}; పొడమె = పుట్టెను.
జలజబంధుని = సూర్యుని, వివస్వంతుని {జలజబంధుడు - జలజము (పద్మము)నకు బంధుడు, సూర్యుడు}; పెండ్లాము = భార్య; సంజ్ఞ = సంధ్యాదేవి; అందు = అందు; శ్రాద్దదేవుండు = వైవత్సుడు యనెడి; మనువు = మనువు; సంజాతుండు = పుట్టినవాడు; అయ్యెన్ = అయ్యెను; మనువున్ = ఆ మనువున; కున్ = కు; శ్రద్ధ = శ్రద్ధ; అనియెడి = అనెడి; మగువ = భార్య; అందున్ = అందు; పదురు = పదిమంది; కొడుకులు = పుత్రులు; కలిగిరి = పుట్టిరి; భద్ర = పవిత్రమైన; యశులు = కీర్తిగలవారు.

భావము:

రాజా! ఆ మహాత్ముని బొడ్డునందు ఎఱ్ఱటి బంగారపు పద్మము పుట్టింది. ఆ పద్మము పైన తనంతటతనే స్వయంభువుగా చతుర్ముఖబ్రహ్మ జన్మించాడు. ఆ బ్రహ్మదేవుని మనసు నందు మరీచి పుట్టాడు. కశ్యపుడు వానికి పుట్టాడు. ఆ కశ్యపుడికి, దక్షుని కుమార్తె అదితి అందు సూర్యుడు పుట్టాడు. సూర్యునికి భార్య సంధ్యాదేవి అందు శ్రాద్ధదేవుడు అనుపేరు గల వైవస్వత మనువు పుట్టాడు. ఆ మనువునకు భార్య శ్రద్ధ యందు పదిమంది పుత్రులు పుట్టారు.