పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : జమదగ్ని వృత్తాంతము

  •  
  •  
  •  

9-426-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన నయ్యింతి వెఱచి మ్రొక్కి వినయంబులాడినం బ్రసన్నుండై "నీ కొడుకు సాధువై, నీ మనుమండు క్రూరుం డగుంగాక" యని ఋచికుం డనుగ్రహించిన నా సత్యవతికి జమదగ్ని సంభవించె; సత్యవతియుం గౌశకీనది యై లోకపావని యై ప్రవహించె; నా జమదగ్నియు రేణువు కూఁతురయిన రేణుకను వివాహంబై వసుమనాది కుమారులం గనియె; నందు.

టీకా:

అనిన్ = అనగా; ఆ = ఆ; ఇంతి = యువతి; వెఱచి = బెదిరిపోయి; మ్రొక్కి = నమస్కరించి; వినయంబులాడిన = ప్రాధేయపడగా; ప్రసన్నుండు = సంతుష్టుడు; ఐ = అయ్యి; నీ = నీ యొక్క; కొడుకు = పుత్రుడు; సాధువు = సాధువు; ఐ = అయ్యి; నీ = నీ యొక్క; మనుమండు = మనుమడు; క్రూరుండు = క్రూరస్వభావి; అగుంగాక = అవుతాడు; అని = అని; ఋచికుండు = ఋచికుడు; అనుగ్రహించినన్ = అనుగ్రహించగా; ఆ = ఆ; సత్యవతి = సత్యవతి; కిన్ = కి; జమదగ్ని = జమదగ్ని; సంభవించెన్ = పుట్టెను; సత్యవతియున్ = సత్యవతి; కౌశకీ = కౌశకీ యనెడి; నది = నది; ఐ = అయ్యి; లోక = లోకములను; పావని = పవిత్రము చేయునది; ఐ = అయ్యి; ప్రవహించెన్ = ప్రవహించినది; ఆ = ఆ; జమదగ్నియున్ = జమదగ్ని; రేణువు = రేణువు యొక్క; కూతురు = పుత్రిక; ఐయిన = ఐన; రేణుకను = రేణుకను; వివాహంబై = పెళ్ళిచేసికొని; వసుమన = వసుమనుడు; ఆది = మున్నగు; పుత్రులన్ = కొడుకులను; కనియెన్ = పుట్టించెను; అందు = వారిలో.

భావము:

ఇలా ఋచికుడు చెప్పగా ఆమె బెదిరిపోయింది. మ్రొక్కి ప్రాధేయపడగా సంతుష్టుడు అయ్యి “నీ పుత్రుడు సాధువు అయి, నీ మనుమడు క్రూరస్వభావి అవుతాడు.” అని ఋచికుడు అనుగ్రహించాడు. అలా సత్యవతికి జమదగ్ని పుట్టాడు. సత్యవతి కౌశకీ నది అయ్యి లోకాలను పవిత్రం చేస్తోంది. ఆ జమదగ్ని రేణువు పుత్రిక రేణుకను పెళ్ళిచేసికొని వసుమనుడు మున్నగు కొడుకులను పుట్టించాడు.