పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : చంద్రవంశారంభము

  •  
  •  
  •  

9-378-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"సిగ్గొకయింతలేక వెలచేడియ కైవడి ధర్మకీర్తులన్
బొగ్గులు చేసి జారు శశిఁ బొంది కటా! కడుపేల దెచ్చుకొం
టెగ్గుదలంపఁగా వలదె? యిప్పుడు గర్భము దించుకొమ్ము నిన్
మ్రగ్గఁగఁ జేసెదం, జెనటి! మానవతుల్ నినుఁ జూచి మెత్తురే?"

టీకా:

గ్గు = లజ్జ; ఒకయింత = కొంచమైనను; లేక = లేకుండ; వెలచేడియ = వేశ్య {వెలచేడియ - ధరకు స్త్రీ, వేశ్య}; కైవడిన్ = వలె; ధర్మ = ధర్మమును; కీర్తులన్ = ప్రతిష్టలను; బొగ్గులుచేసి = కాల్చివేసి; జారు = వ్యభిచారి; శశిన్ = చంద్రుని; పొంది = కలిసి; కటా = అయ్యో; కడుపు = గర్భము; ఏలన్ = ఎందుకు; తెచ్చుకొంటి = తెచ్చుకొన్నావు; ఎగ్గు = దోష; తలపన్ = చింత; వలదె = ఉండవద్దా; ఇపుడు = ఇప్పుడు; గర్భమున్ = కడుపును; దించుకొమ్ము = తీసేయించుకొనుము; నిన్ = నిన్ను; మ్రగ్గఁగజేయెదన్ = నిలువునాకాల్చెదను; చెనటి = చెడ్డదాన; మానవతుల్ = శీలవతులు; నినున్ = నిన్ను; చూచి = చూసి; మెత్తురే = మెచుచుకోరు.

భావము:

ఓ నీచురాల! ఏమాత్రం లజ్జ లేకుండ వేశ్యలా ధర్మాన్ని ప్రతిష్టని నాశనం చేసావు కదే. వ్యభిచారి చంద్రుడిని ఎందుకు పొందావే. అయ్యో! గర్భం కూడ తెచ్చుకొన్నావు. పాపచింత ఉండక్కరలేదా. ఇప్పుడు గర్బం దించుకో. నిన్ను నిలువునా కాల్చెస్తాను. మానవతులు నిన్ను చూసి మెచ్చుకుంటారా?”