పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : చంద్రవంశారంభము

  •  
  •  
  •  

9-376.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మూఁడులోకములను గెల్చి మోఱకమున
ని బృహస్పతి పెండ్లాముఁ జారుమూర్తిఁ
దార నిలుచొచ్చి కొనిపోయి న్ను గురుఁడు
వేడినందాక నయ్యింతి విడువఁ డయ్యె.

టీకా:

ఒక = ఒక; వేయి = వెయ్యి; తలలు = శిరస్సులు; తోనుండు = కలిగుండెడి; జగన్నాథున్ = విష్ణుమూర్తియొక్క; బొడ్డు = నాభి యనెడి; తమ్మిన = కమలమునందు; బ్రహ్మా = బ్రహ్మదేవుడు; పుట్టెన్ = జనించెను; మొదలన్ = ముందరగా; అతని = అతని; కిన్ = కి; గుణములన్ = లక్షణములలో; అతనిన్ = అతనిని; పోలిన = పోలియుండెడి; దక్షుడు = సమర్థుడు; అగు = ఐన; అత్రి = అత్రి; సంజాతుండు = పుట్టినవాడు; అయ్యెన్ = అయ్యెను; అత్రి = అత్రియొక్క; కడగంటి = కటాక్షపు; చూడ్కులన్ = చూపులందు; కలువలసంగడీడు = చంద్రుడు; ఉదయించి = పుట్టి; విప్రుల = బ్రాహ్మణులు; ఓషధుల్ = ఓషధుల; కున్ = కు; అమరన్ = చక్కగా; తారా = నక్షత్రముల; తతి = సమూహముల; కిన్ = కు; అజుని = బ్రహ్మదేవునియొక్క; పంపునన్ = ఆనతిమేర; నాథుడు = ప్రభువు; ఐ = అయ్యి; ఉండి = ఉండి; రాజసూయంబున = రాజసూయయజ్ఞము; చేసి = చేసి.
మూడులోకములనున్ = ముల్లోకములను; గెల్చి = జయించి; మోఱకమునన్ = మూర్ఖత్వముతో; చని = వెళ్లి; బృహస్పతి = బృహస్పతియొక్క; పెండ్లామున్ = భార్యను; చారుమూర్తిన్ = అందగత్తెను; తారన్ = తారను; ఇలు = ఇంటిలో; చొచ్చి = ప్రవేశించి; కొనిపోయి = తీసుకెళ్ళి; తన్నున్ = అతనిని; గురుడు = బృహస్పతి; వేడినన్న = అడిగినను; ఆ = ఆ; ఇంతిన్ = స్త్రీని; విడువడు = వదలనివాడు; అయ్యెన్ = అయ్యెను.

భావము:

సహస్రశీర్ష పురుషుడు అయిన శ్రీమహావిష్ణువు నాభి కమలం నుండి బ్రహ్మదేవుడు జనించాడు. ముందరగా అతనికి తనని పోలిన గుణవంతుడు అత్రి పుట్టాడు. అత్రి కడగంటి చూపు లందు చంద్రుడు పుట్టాడు. బ్రహ్మదేవుని ఆనతిమేర చంద్రుడు బ్రాహ్మణులు ఓషధులు నక్షత్రాలులకు రాజు అయ్యాడు. అతను రాజసూయయాగం చేసి, ముల్లోకాలను జయించాడు. బృహస్పతి అందమైన భార్య తారను మూర్ఖత్వంతో తీసుకుపోయాడు. బృహస్పతి అడిగినా వదలలేదు.