పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : చంద్రవంశారంభము

  •  
  •  
  •  

9-375-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"చంద్రగౌరమైన చంద్రవంశమునందుఁ
జంద్రకీర్తితోడ నిత మైన
ట్టి పుణ్యమతుల నైళాది రాజుల
నింక వినుము మానవేంద్రచంద్ర!

టీకా:

చంద్ర = చంద్రునివలె; గౌరము = స్వచ్ఛమైనట్టిది; ఐన = అయినట్టి; చంద్రవంశమున్ = చంద్రవంశము; అందున్ = లో; చంద్ర = ఆచంద్రార్కమైన; కీర్తి = యశస్సు; తోడన్ = తోటి; జనితము = కలిగునవారు; ఐన = అయిన; అట్టి = అటువంటి; పుణ్యమతులన్ = పుణ్యాత్ములను; ఐళ = పురూరవుడు {ఐళుడు - ఇళ (బుధుని భార్య) యొక్క పుత్రుడు, పురూరవుడు}; ఆది = మున్నగు; రాజుల = రాజులను; ఇంకన్ = మరి; వినుము = వినుము; మానవేంద్రచంద్ర = మహారాజ.

భావము:

“ఓ పరీక్షిత్తు రాజచంద్ర! చంద్రవంశం చంద్రునివలె స్వచ్ఛ మైనది. ఆ చంద్రవంశంలో పుట్టిన ఆ చంద్రార్క కీర్తిమంతుడు పుణ్యాత్ముడు అయిన పురూరవుడు మున్నగు రాజుల గురించి చెప్తాను. శ్రద్ధాగా విను.