పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : నిమి కథ

  •  
  •  
  •  

9-369-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"తి మోహాకులితంబు సాంద్రమమతాహంకారమూలంబు సం
నానాసుఖదుఃఖపీడిత మనిత్యం; బిట్టి దేహంబు సం
కృతి నా కేటికి? మీనజీవనము భంగిన్ భీతి బాహుళ్య మం
చిరుల్ పెద్దలు దీనిఁ జేకొనరు సర్వేశున్ హరిం గొల్చుచున్."

టీకా:

అతి = మిక్కిలి; మోహా = మోహముచేత; ఆకులితంబు = కలతచెందినది; సాంద్ర = గాఢమైన; మమత = నాది; అహంకార = నేను లకు; మూలంబు = కారణభూతము; సంతత = ఎడతెగని; నానా = వివిధములైన; సుఖ = సుఖములు; దుఃఖ = దుఃఖములచే; పీడితము = పీడింపబడెడిది; అనిత్యంబు = అశాశ్వతమైనది; ఇట్టి = ఇటువంటి; దేహంబున్ = శరీరముతోటి; సంకృతి = బంధము; నా = నా; కున్ = కు; ఏటికిన్ = ఎందులకు; మీన = చేప; జీవనము = జీవితము; భంగిన్ = వలె; భీతి = భయములు; బాహుళ్యమున్ = అనేకములుకలది; అంచున్ = అనుచు; ఇతరులు = మిగతా; పెద్దలు = వివేకవంతులు; దీనిని = దీనిని; చేకొనరు = స్వీకరించరు; సర్వేశున్ = నారాయణుని; హరిన్ = నారాయణుని; కొల్చుచున్ = సేవించుచు.

భావము:

“మోహంతో మిక్కిలి కలతచెందేది మమతాహంకారాలకు కారణభూతం అయినది ఎడతెగని సుఖదుఃఖాలచే పీడింపబడేది అశాశ్వతమైనది శరీర సంబంధం. ఇటువంటి శరీర సంబంధం నాకెందుకు. వివేకవంతులు సర్వేశ్వరుడైన విష్ణుమూర్తిని సేవిస్తూ, చేప జీవితం వలె నిరంతంర మరణభయంతో సాగే ఈ దేహ బంధాన్ని స్వీకరించరు కదా.”