పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : నిమి కథ

  •  
  •  
  •  

9-367.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చేయ నింద్రుని యాగంబు చెల్లఁజేసి
గురుఁడు చనుదెంచి శిష్యుపైఁ గోప మెత్తి
"యోరి నా వచ్చునందాక నుండ" వనుచు.
తని దేహంబు పడుఁగాత ని శపించె

టీకా:

ధన్యుడు = ధన్యాత్ముడు; ఆ = ఆ; ఇక్ష్వాకు = ఇక్ష్వాకునియొక్క; తనయుడు = పుత్రుడు; ఔ = అయిన; నిమి = నిమి; యాగము = యజ్ఞము; ఆచరింపన్ = చేయవలెనని; కోరి = తలచి; ఆ = ఆయొక్క; వశిష్టున్ = వశిష్టుని; ఆర్త్విజ్యమున్ = చేయించుటను; తాన్ = అతను; అర్థింపన్ = కోరగా; కని = చూసి; ఆతడు = అతను; ఇంద్రుని = ఇంద్రుడుయొక్క; మఖమున్ = యజ్ఞమును; చేయింపన్ = చేయించుటకు; ఇయ్యకొనినాడు = ఒప్పుకొంటిని; మఱి = మరలి; వత్తున్ = వచ్చెదను; కొదవ = ఇబ్బందేమి; లేదు = ఉండదు; అనన్ = అనగా; వచ్చి = వెనుకకొచ్చి; సంసారము = జీవితము; ఎంతయున్ = మిక్కిలిగ; చంచలంబు = నిలుకడలేనిది; కాలయాపన = ఆలస్యముచేయుట; ఏలన్ = ఎందుకు; క్రతువున్ = యజ్ఞమును; చేసెదను = చేసెదను; అని = అనుకొని; అన్య = మరొక; ఋత్విక్కులన్ = ఋత్విక్కులను; అతడున్ = అతడు; కూర్చి = కుదుర్చుకొని.
చేయన్ = పూర్తిచేయగా; ఇంద్రుని = ఇంద్రుడుయొక్క; యాగంబున్ = యజ్ఞమును; చెల్లజేసి = పూర్తిచేసి; గురుడు = గురువు; చనుదెంచి = వచ్చి; శిష్యున్ = శిష్యుని; పైన్ = మీద; కోపమెత్తి = కోపగించి; ఓరి = ఓయి; నా = నేను; వచ్చున్ = వచ్చెడి; అందాక = వరకు; ఉండవు = ఆగలేదు; అనుచున్ = అనుచు; అతనిన్ = అతనిని; దేహంబుపడుగాతము = మరణించుగాక; అని = అని; శపించెన్ = శాపమిచ్చెను.

భావము:

ధన్యాత్ముడు ఇక్ష్వాకుని పుత్రుడు నిమి యాగం చేయాలని తలచి వశిష్టుని చేయించమని కోరడు. అతను “ఇంద్రుడి యాగం చేయించడానికి ఒప్పుకున్నాను వెళ్ళి వస్తాను ఇబ్బందేం ఉండదు.” అన్నాడు. వశిష్టుని దగ్గరనుండి వెనక్కి వచ్చిన నిమి జీవితం నిలుకడ లేనిది ఆలస్యం చేయటం మంచిది కాదు వెంటనే యాగం చేసేస్తాను అనుకొన్నాడు. మరొక ఋత్విక్కుతో యాగం పూర్తిచేసాడు. ఇంద్రుడి యజ్ఞం పూర్తిచేసి గురువు వశిష్టుడు వచ్చి శిష్యుని మీద కోపగించి, తను వచ్చే వరకు ఆగలేదు కనుక మరణించు గాక అని శాపమిచ్చాడు.